"స్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ" 2004 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. అనాధ బాలికలను ఆదరించి పోషించి చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ప్రధానలక్ష్యం. తల్లిదండ్రులు లేక సమాజ ఆదరణ లభించక పొలం పనుల్లో కూలీలుగా, ఇళ్ళలో పని వాళ్ళుగా మారే బాలికల జీవితాల్లో వెలుగులు నింపి చైతన్యవంతులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను మన సంస్థ తలకెత్తుకుంది.

ఉపాధ్యాయుని కృషితో పాఠశాలకు పక్కా భవన నిర్మాణం
జాగర్లమూడి ఎ.ఎస్. హైస్కూలు విద్యార్ధులు భవన సౌకర్యం లేక ఇబ్భందులు పడుతుండగా స్పందించిన తెలుగు మాష్టారు కొల్లా వెంకటేశ్వర్లు 25 లక్షల రూపాయల ఖర్చుతో సుందర భవనాలు నిర్మించారు. 40 సంవత్సరాలుగా పెంకుటింటిలో ఉన్న పాఠశాల శిధిలావస్థకు చేరిన తరుణంలో ఎం.పి.లు డా. దగ్గుబాటి
వెంకటేశ్వరరావు, డా. డి. రామానాయుడు, పూర్వ విద్యార్ధి జెట్టి శివరామ ప్రసాదు, రాజమండ్రిలో ఉంటున్న ధూళిపల్లి సుబ్బారావు తదితరుల సహకారంతో భవనాలు నిర్మించారు.

 తొలి ఫలితం పొందిన అవని
నిరుపేద కూలి కుటుంబంలో పుట్టిన నేను ఎంసెట్ వ్రాయలేక పోయాను. స్పందన సొసైటి అదరణతో,
ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ సహకారంతో బి.టెక్. పూర్తిచేసాను.