అనాధ బాలికలకు అండ స్పందన
తల్లి దండ్రులను పోగొట్టుకొని ఆదరించే దిక్కులేక గాలికి, ధూళికి తిరిగే పిల్లలెందరినో మనం చూస్తున్నాం. మట్టిలో మాణిక్యలాంటి అనాధ పిల్లలు అదరణ లభించక అమూల్యమైన బాల్యాన్ని వెట్టిచాకిరికి ఉపయోగిస్తున్నారు. వీరిని అదరించి, అన్నంపెట్టి చదివిస్తే మంచి జీవితం వారికి దక్కుతుంది. ప్రేమ, భధ్రతలతో అనాధ, పేద పిల్లలకు అశ్రయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నిత్య జీవితంలో వివిధ వ్యాపకాలతో తీరిక లేకుండా ఉంటున్న మనం సమాజ అభివృధికి కొంతైనా కృషి చేయవలసిన సమయం ఆసన్నమయినది.

"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను". అన్న శ్రీ శ్రీ వాక్కును దృష్టిలో ఉంచుకొని మన సమయాన్ని, ధనాన్ని కొంతైనా పేద పిల్లల కోసం కేటాయిద్దాం. ఈ విధంగా చేయటం పరోక్షంగా దేశాభివృద్దికి దోహాదం చేసినట్లే.

"అనాధ బాలికలను అదరిద్దాం-ప్రతిబావంతులను ప్రోత్సహిద్దాం" అనే ధ్యేయంతో పర్చూరులోని స్పందన ఎడ్యుకేషనల్ సొసైటి 2004 లో ప్రారంభమైనది. ఈ సంస్ధ ద్వారా 14 మంది బాలబాలికలు లబ్ది పొందుతున్నారు. అనాధలైనవారిని చేరదీసి 3వ తరగతి నుంచి బిటెక్ వరకు ఉచిత భోజన వసతులతో ఆదరిస్తున్నారు. 2005 నుండి జాగర్లమూడిలో ఒక పూరిపాకలో విద్యార్ధులకు వసతి కల్పించారు. దాతల సహకారంతో స్ధానిక వ్యవసాయ మార్కెట్ కమిటి ఎదురుగా 40 సెంట్ల స్ధలంలో 10 లక్షల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సంస్ధ నిర్వహణకు పలువురు దాతలు సహకారం అందించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న బాలికలందరు విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాల్లో స్ధిరపడే వరకు పూర్తి రక్షణ కల్పించడమే ఈ సంస్థ ధ్యేయం. అనాధ బాలలకు నీడనిచ్చి వారి జీవిత సరళిని వినూత్నంగా తీర్చిదిద్దే శరణాలయానికి "బాల కుటీరం" అని నామకరణం చేసారు.

      
దాతల సహకారంతో నిర్మించిన బాలకుటీరం   స్పందన ఎడ్యుకేషనల్ సోసైటి అధ్యక్షుడు కొల్లా వెంకటెశ్వర్లు


 
స్పందన ఎడ్యుకేషనల్ సోసైటి ని
ప్రారంభిస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి
 
బాలకుటీరాన్ని ప్రారంభిస్తున్న
అనాధ బాలిక శ్రీ లక్మి