ఉపాధ్యాయుని పట్టుదల ఫలితం పాఠశాలకు పక్కా భవన నిర్మాణం
ఒక ఉపాధ్యాయుని పట్టుదల పాఠశాలలో తరగతి గదుల సమస్య తీర్చింది. దాదాపు రూ.25 లక్షలతో పక్కా భవనాల నిర్మాణం జరిగింది యద్దనపూడి మండలం జాగర్లమూడి ఎ ఎస్ ఉన్నత పాఠశాలను 1962 లో స్ధాపించారు. అప్పట్లో నిర్మించిన పెంకుటింట్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటివల కాలంలో అవి శిధిలావస్థకు చేరాయి. అదే పాఠాశాలలో తెలుగు పండిట్ గా పనిచేస్తున్నా కొల్లా వెంకటేశ్వర్లు దాతల నుంచి విరాళాలు సేకరించి పక్కా భవనాలు నిర్మించాలని తలపెట్టారు దీని కోసం గ్రామస్తుల సహకారం అర్ధించారు. ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావును 1999లో కలిసి ఎం.పి నిధులు కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అడిగిందే తడవుగా నాలుగు లక్షలు ఎం.పి నిధులను కేటాయించారు. బాపట్ల ఎం.పి డాక్టరు డి.రామానాయుడును కలిసి పరిస్థితి వివరించారు.తన ఎం.పి నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించారు.

జనవరి 2001లో జన్మభూమి నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పర్చూరు శాసనసభ్యులు జే.ఎల్. పద్మావతి వీటి మంజూరుకు కృషి చేశారు. దీనికి సంబందించి 30 శాతం నిధులను జెట్టి శివరామ ప్రసాద్ సమకూర్చారు. నాగులపాలెం గ్రామానికి చెందిన దూళిపాళ్ళ సుబ్బారావు భవన నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ.2.5లక్షలు ఇచ్చారు. మరో పదిమంది పూర్వవిద్యార్ధులు రూ.10వేల చొప్పున సహాయం అందజేశారు.

ఇలా పట్టుదలతో నిరంతరం కొల్లా వెంకటేశ్వర్లు శ్రమించారు. దాతలందరి సహకారంతో ఉపాధ్యాయుని నిర్విరామ కృషితో పది గదుల భవననిర్మాణం జరిగింది. శిధిలావస్థకు చేరిన పెంకుటింట్లో వర్షకాలంలో తడుస్తూ విద్య నభ్యసించాల్సిన అవస్థ నుంచి విద్యార్ధులకు విముక్తి లభించింది. భవన నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయలకల్పనకు కూడా ఉపాద్యాయుడు వెంకటేశ్వర్లు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. పండరిపురం రోటరీ క్లబ్ వారిని సంప్రదించి, రూ.10 వేలు విలువైన బెంచీలను విరాళంగా ఇప్పించుకోగలిగారు. పాఠశాలలోనే విద్యార్థుల సౌకర్యార్ధం నిరంతర విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉపాద్యాయులకు, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పది గదులను నిర్మించారు.
 

పూర్వం పెంకుటింట్లో నిర్వహంచిన పాఠశాల
 
ఉపాద్యాయుని నిర్విరామ కృషి, దాతల
నిధులతో నిర్మించిన పాఠశాల భవనం
 
తెలుగు పండిట్
కొల్లా వెంకటెశ్వర్లు